జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ప్రాంతంలో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడి దేశవ్యాప్తంగా తీవ్ర ఆవేదనను కలిగించింది. ఈ దాడిలో అమాయకుల ప్రాణాలు పోవడం, భద్రతా వ్యవస్థపై ఉన్న ముప్పును మళ్లీ గుర్తుచేసింది. ఈ నేపథ్యంలో భారతదేశ ప్రజలు సంఘీభావాన్ని ప్రకటిస్తూ, తమ దేశభక్తిని, మానవత్వాన్ని చాటుతూ అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా తన బాధ్యతను చాటుకుంటూ రాష్ట్రవ్యాప్తంగా శాంతి ర్యాలీలను, కొవ్వొత్తుల ప్రదర్శనలను నిర్వహించింది.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్పందన:పహల్గామ్ దాడిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా స్పందించారు. పార్టీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి నేతృత్వంలో తాడేపల్లి కేంద్ర కార్యాలయం నుంచి భరతమాత విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి అమరుల కుటుంబాలకు సంఘీబావంగా సంతకాలు చేశారు.
సజ్జల వ్యాఖ్యలు:
సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ – భారతదేశం ఒక జాతిగా ఉన్నతమైన విలువలపై నిలబడి ఉంది. జాతి సమైక్యత, సౌభ్రాతృత్వమే భారతదేశ ఆత్మ. ఉగ్రవాదులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ దేశాన్ని వంచించలేరు. మానవత్వంపై జరిగిన ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము, అని అన్నారు. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అన్ని మతాలు, అన్ని కులాలు ఇక్కడ సమానమేనని, భిన్నత్వంలో ఏకత్వం అనే పవిత్ర భావనతో ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోందని, దాన్ని దెబ్బ కొట్టడానికి తరచూ ప్రయత్నాలు సాగుతున్నాయని పేర్కొన్నారు. ఇది మానవతా విలువలపై ఓ నేరం, కేవలం ఒక ప్రాంతం లేదా మతాన్ని టార్గెట్ చేయడం కాదు, ఇది భారతదేశ సమైక్యతపై దాడి అని చెప్పారు. ఇలాంటి చర్యలు మన నైతికతను దిగజార్చలేవు. ప్రతీ ఒక్కరూ మానవత్వంతో స్పందించాలి, అని పేర్కొన్నారు.రాజకీయాలకు
అతీతంగా స్పందన:
ఈ ఘటనపై సజ్జల ఉగ్రవాద దాడులు దేశ ప్రజల ఉక్కు సంకల్పాన్ని చెదరగొట్టలేవని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. పహల్గామ్ దాడిని మానవత్వంపై జరిగిన హింసగా పేర్కొన్నారు. నరమేథంలో కన్నుమూసిన ఏపీకి చెందిన కుటుంబాలను పార్టీ సీనియర్ నాయకులు పరామర్శిస్తారని చెప్పారు. ఆయా కుటుంబాల వారికి స్వాతంన కలిగిస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరూ నైతికంగా ఆయా కుటుంబాలకు అండగా ఉండాలని కోరుకుంటోన్నామని అన్నారు.ఇలాంటి ఉగ్రవాద చర్యలకు నిరసనగా దేశవ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమాల్లో తమ పార్టీ భాగస్వామిగా తప్పకుండా ఉంటుందని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ అండగా నిలవాల్సిన సమయం అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మానవత్వంతో స్పందించాలని కోరారు. పార్టీ తరపున పార్టీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, మాజీ మంత్రి మేరుగ నాగార్జున, పార్టీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి నారాయణమూర్తి, అధికార ప్రతినిధులు కారుమూరి వెంకటరెడ్డి, శివశంకర్, నాగార్జున యాదవ్ మాజీ ఎంపీ నందిగం సురేష్, ఎన్.చంద్రశేఖర్ రెడ్డి, చల్లా మధుసూదన్ రెడ్డి, పుత్తా ప్రతాప్ రెడ్డి, మంగళగిరి ఇన్ఛార్జి దొంతిరెడ్డి వేమారెడ్డి, అనుబంధ సంఘాల నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు.
Read also: Vidadala Rajini : మాజీ మంత్రి విడదల రజిని మరిది గోపి అరెస్ట్