
CM Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఏడు రోజుల జపాన్ పర్యటన ముగించుకుని బుధవారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని బృందానికి పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ సలహాదారులు, కార్పొరేషన్ ఛైర్మన్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. ఏప్రిల్ 16 న సీఎం నేతృత్వంలో అధికారులు బృందం ప జపాన్ పర్యటనకు వెళ్లింది. ఏడు రోజుల పాటు జపాన్ లో పర్యటించిన అధికారుల వివిధ పరిశ్రమల యాజమాన్యాలతో సంప్రదింపులు జరిపి తెలంగాణలో రూ. 12వేల 62 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు.
