
రిజిస్ట్రేషన్ శాఖ (IGR)కి అందించిన డాకుమెంట్స్ ప్రకారం..
ఈ ఆఫీస్ స్థలం వన్ ప్లేస్ లోధాలో ఉంది. అలాగే ఈ స్థలం దాదాపు 1,146.88 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఈ డీల్ పై రూ.48 లక్షల స్టాంప్ డ్యూటీ, రూ.30 వేల రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించారు. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (RERA) ప్రకారం, వన్ ప్లేస్ లోధా ఒక కమర్షియల్ ప్రాజెక్ట్. దీనిని మాక్రోటెక్ డెవలపర్స్ (లోధా) డెవలప్ చేసింది. అలాగే 1.08 ఎకరాలలో విస్తరించి ఉండగా, 27,392 చదరపు అడుగుల వరకు ఆఫీస్ స్థలం ఉంది.
స్క్వేర్ యార్డ్స్ డేటా ఇంటెలిజెన్స్ ప్రకారం..
మే 2024 నుండి ఏప్రిల్ 2025 మధ్య వన్ ప్లేస్ లోధాలో మొత్తం ఎనిమిది అగ్రిమెంట్స్ జరిగాయి. ఈ డీల్ మొత్తం విలువ రూ.618 కోట్లు. ఈ ప్రాజెక్ట్‌లోని ఆస్తుల సగటు ధర గజానికి రూ. 48,000. లోయర్ పరేల్ ముంబైలోని రెసిడెన్షియల్ & కమర్షియల్ ప్రాంతాలలో ఒకటి. అంతేకాక బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ (BKC) & నారిమన్ పాయింట్ వంటి బిజినెస్ ప్రాంతాలకు బాగా దగ్గర ఉంటుంది. స్క్వేర్ యార్డ్స్ ప్రకారం, అభిషేక్ బచ్చన్, షాహిద్ కపూర్, అమిష్ త్రిపాఠి ఇంకా మనోజ్ బాజ్‌పేయి వంటి బాలీవుడ్ తారలకు కూడా లోయర్ పరేల్‌లో ఇళ్ళులు ఉన్నాయి. ఈ సమాచారం IGR ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ పేపర్స్ నుండి లభించింది.
అక్షయ్ కుమారుకు బంపర్ లాభం
తాజాగా అక్షయ్ కుమార్ అమ్మిన అపార్ట్మెంట్లపై మంచి లాభం అందుకున్నాడు. 5.35 కోట్లకు అమ్మిన ఈ అపార్ట్‌మెంట్‌ను అక్షయ్ కుమార్ 2017 నవంబర్‌లో కేవలం 2.82 కోట్లకు కొన్నాడు. ఈ విధంగా దాని విలువ 89 శాతం పెరిగింది. ఈ అపార్ట్మెంట్ కార్పెట్ ఏరియా 100.34 చదరపు మీటర్లు (1,080 చదరపు అడుగులు). ఈ అపార్ట్‌మెంట్‌కు రూ.32.1 లక్షల స్టాంప్ డ్యూటీ, రూ.30,000 రిజిస్ట్రేషన్ ఫీజు ఉంది. అలాగే రూ.1.25 కోట్లకు విక్రయించిన రెండవ అపార్ట్‌మెంట్‌ను 2017లో రూ.67.19 లక్షలకు కొన్నాడు. దీని విలువ కూడా 86 శాతం పెరిగింది. ఈ అపార్ట్మెంట్ కార్పెట్ ఏరియా 23.45 చదరపు మీటర్లు (252 చదరపు అడుగులు).
Read Also: Pahalgam Terror Attack : ఉగ్రదాడి మృతులపై అధికారిక ప్రకటన