Good News : సింగరేణి.. వారికి 50% జీతంతో స్పెషల్ లీవ్స్

తెలంగాణ రాష్ట్రంలోని సింగరేణి కార్మికులకు శుభవార్త. తీవ్రమైన కాలేయ వ్యాధి (లివర్ సిరోసిస్) బారిన పడిన కార్మికులకు కంపెనీ యాజమాన్యం ప్రత్యేక సెలవుల (స్పెషల్ లీవ్స్) సౌకర్యాన్ని ప్రకటించింది. ఈ సెలవులు 50 శాతం జీతంతో మంజూరు చేయనున్నట్లు అధికారిక ఉత్తర్వులు విడుదలయ్యాయి. బాధిత కార్మికులు పూర్తిగా కోలుకునే వరకు ఈ వెసులుబాటు వర్తించనున్నట్లు స్పష్టం చేశారు.

singareni employees

స్పెషల్ లీవ్ సదుపాయంఇప్పటికే గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్, టీబీ, పక్షవాతం, కుష్టు, ఎయిడ్స్, మూత్రకోశ, మెదడు సంబంధిత వ్యాధులకు స్పెషల్ లీవ్ సదుపాయం కల్పిస్తున్న సింగరేణి యాజమాన్యం, ఇప్పుడు అదే విధంగా లివర్ సిరోసిస్ వ్యాధిని కూడా ఈ జాబితాలో చేర్చింది. ఇది లివర్ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న కార్మికులకు ఎంతో ఊరటనిచ్చే నిర్ణయంగా నిలుస్తోంది.

ఉద్యోగుల సంక్షేమమే లక్ష్యం

ఈ చర్యతో పాటు కార్మికుల ఆరోగ్యంపై కంపెనీ మరింత దృష్టి పెట్టినట్లు స్పష్టమవుతోంది. ఉద్యోగుల సంక్షేమమే లక్ష్యంగా తీసుకుంటున్న ఈ విధానాలు, సంస్థపై కార్మికుల్లో నమ్మకాన్ని పెంచుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే, ఈ వెసులుబాటుతో శారీరకంగా బాధపడుతున్న వారు ఆరోగ్యవంతంగా కోలుకొని తిరిగి విధుల్లో చేరే అవకాశాలు మెరుగవుతాయని కంపెనీ యాజమాన్యం అభిప్రాయపడుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *